Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలకు సంబంధించిన కేటగిరీ 2 కింద పీహెచ్డీ ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23 వరకు తమ పేర్లను నమోదు చేసుకుని దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామి నేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ (మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనిటిక్స్) మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 16 వరకు, బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 23 వరకు సంబంధిత కళాశాల ల్లో చెల్లించాలని చెప్పారు. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు మొదటి, మూడు, అయిదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 24 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 30 వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని పేర్కొన్నా రు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఎంఈడీ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి చెందిన నేపథ్యంలో గత నెల 27న రాష్ట్రప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 21న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా సమయం, పరీక్షా కేంద్రాలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీబీఏ, తదితర కో ర్సుల అన్ని సంవత్సరాల సప్లమెంటరీ ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు చె ప్పారు. ఈ పరీక్షలను దూరవిద్య కేంద్రంలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్‌టైం చాన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, బిలిబ్ఐఎస్సీ, బీసీజే, ఎంలిబ్‌ఐఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్‌టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 5నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.