Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ) బ్రిడ్జి కోర్సు సెమిస్టర్ల మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను రెండు వారాల తరువాత నుంచి సంబంధిత కళాశాలల్లో తీసుకోవాలని సూచించారు. ఈ ఫలితాలపై రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 25వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 26వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University | డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
Pollution | ఆ పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం.. రోడ్లపైకి వస్తే రూ.20వేల జరిమానా..!