Gadwal MLA | గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు రోజురోజుకీ ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు ఆధిపత్యం చెలాయిస్తుండటంతో.. మొదట్నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు అన్యాయం జరుగుతుందని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వేరే పార్టీ నుంచి వచ్చి మాపై మీ పెత్తనమేంటి అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి తమ సహాయం లేకుండా గెలవాలని సవాలు విసరుతున్నారు. బుధవారం జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అవమానించడంపై మండిపడుతున్నారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా గద్వాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్‌తో పాటు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వారిని స్టేజిపై కూర్చోబెట్టారు. కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న నీలి శ్రీనివాస్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్పలను మాత్రం వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో వారు వేదిక పైకి వెళ్లి అధికారులను అడిగే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని కిందకు నెట్టివేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ.. వేరే పార్టీల నుంచి వచ్చిన వారి కారణంగా తాము అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ వేదికను పంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారితో పాటు పలువురు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తిరగబడ్డారు. తమను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గద్వాల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తిరగబడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు
దమ్ముంటే రాజీనామా చేసి మా సహాయం లేకుండా గెలువు, వేరే పార్టీ నుండి వచ్చి మా మీద పెత్తనం ఏంటి అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
కాంగ్రెస్ నాయకులను అవమానించిన ఎమ్మెల్యేపై… https://t.co/jT0bpEbYt5 pic.twitter.com/TN5WcBqHUh
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025
గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ప్రోటోకాల్ విరుద్ధంగా తన మనుషులను వేదిక మీద కూర్చోబెట్టడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే… pic.twitter.com/6BfQOnCR6c
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2025