సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 22:45:30

నలుగురు అదనపు ఎస్పీల బదిలీకి ఉత్తర్వులు జారీ

నలుగురు అదనపు ఎస్పీల బదిలీకి ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌ : నలుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం అడిషనల్‌ డీసీపీ(ఆపరేషన్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పి. శోభన్‌ కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా... జయశంకర్‌ భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న కె. సురేశ్‌ కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అదేవిధంగా వరంగల్‌, అడిషనల్‌ డీసీపీ(క్రైమ్స్‌, ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న వి. తిరుపతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా ఉన్న అట్లా రమణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 


logo