హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది. అంటే ఈ భూములను ఇకపై ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునే వె సులుబాటు కల్పించింది. భూముల కన్వర్షన్‌కు సంబంధించి ఈ నెల 17న జరిగిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 22 పారిశ్రామిక వాడల్లోని 9292.53 ఎకరాల భూమిని కన్వర్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూములను అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం వినియోగించవచ్చని, కార్యాలయాల ఏర్పాటు, హోట ళ్లు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, రీసెర్చ్ సెంటర్ల నిర్మాణానికీ వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
పార్కు లు, స్పోర్ట్స్, కల్చరల్ సెంటర్లు, టెక్నాలజీ పార్కులు, క్యాంపస్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించింది. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు రిజిస్ట్రేషన్ (ఎస్ఆర్వో) విలువలో 30 శాతం చెల్లించాలని ఆదేశించింది. 80 ఫీట్ల కన్నా తక్కువ వెడ ల్పు గల రోడ్లు ఉన్న ప్లాట్స్‌కు 30 శాతం, 80 ఫీట్లకన్నా ఎక్కువ వెడల్పు ఉన్న ప్లాట్లకు 50 శాతం చెల్లించాలని పేర్కొన్నది. మెజార్టీ భూమి 30 శాతం పరిధిలోకే వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఇక ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో 45 రోజుల్లో చెల్లించాలన్న నిబంధన పెట్టింది. కాగా పరిశ్రమల భూములను కన్వర్షన్ చేసి విక్రయిస్తుండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నది. దీని వెనుక రేవంత్ సర్కారు రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన విమర్శలు చేశారు. అత్యంత విలువైన భూములను తమ అనుయాయులకు తక్కువ ధరకే కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, ప్రజాధనాన్ని దోచుకునే ప్రణాళికలు వేశారని ఆరోపించారు.
పథకాలపై అడుగు పడదు కానీ..
కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఓరకంగా స్వప్రయోజనాల కోసమైతే మరోరకంగా ముందుకు పోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల భూములను మల్టీ పర్పస్ జోన్లుగా కన్వర్షన్ చేయడంపై ఎనలేని ప్రేమను కనబరుస్తున్నదని, ఈ విషయంలో ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో ముందు కు పోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల కన్వర్షన్‌పై క్యాబినెట్ ఆమోదం పొందిన 5 రోజుల్లోనే జీవో కూడా జారీచేసింది. కానీ, పారిశ్రామిక భూముల కన్వర్షన్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.