హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ ఫోబియా పట్టుకొన్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా విమర్శించారు. కేసీఆర్ ఫోబియా అనే రాజకీయ వ్యాధితో బాధపడుతున్న విపక్ష నేతలు త్వరలోనే అదృశ్యమవుతారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
సీఎం పదవి ఖాళీగా లేకున్నా విపక్ష నేతలు ఆ పదవి కోసం వెయింటింగ్ లిస్టును సిద్ధం చేసుకొన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో టీఆర్ఎస్ పాలనే కొనసాగుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ ఇమేజ్ను పరిరక్షించేందుకు కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు.