నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశం..స్వాగతించిన వినోద్ కుమార్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ | నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలుపడం గొప్ప విషయమని రాష్ట్ర రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ : నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలుపడం గొప్ప విషయమని రాష్ట్ర రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తారని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్షంలో కూడా మహిళలు అడుగుపెట్టిన చరిత్ర ఉందన్నారు. కొన్ని శతాబ్దాల క్రితమే మన దేశంలో రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా వంటి మహిళలు యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా మహిళలు గొప్పగా రాణిస్తారని ఆయన చెప్పారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారని, యూపీపీఎస్సీ ద్వారా ఈ అడ్మిషన్లు జరుగుతాయని వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలలోని ఇంటర్ విద్యార్థినులకు ఎన్.డీ.ఏ. లో అడ్మిషన్ల కోసం లెక్చరర్లు చొరవ తీసుకోవాలని, ఆ దిశగా కృషి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఉమర్ జలీల్ కు ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

