5 రాష్ర్టాల్లో 13% ఓటర్ల తొలగింపు
ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ర్టాల్లో ఓటర్ల సంఖ్య 13.24 శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఐదు రాష్ర్టాల్లో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 18.71 కోట్ల నుంచి 16.43 కోట్లకు తగ్గింది.
- వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ‘సర్’ తర్వాత భారీగా తగ్గిన ఓటర్లు
- ఏకంగా 2.29 కోట్ల ఓట్లు తొలగింపు
- యూపీలోనే 2.04 కోట్ల తగ్గుదల
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ర్టాల్లో ఓటర్ల సంఖ్య 13.24 శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఐదు రాష్ర్టాల్లో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 18.71 కోట్ల నుంచి 16.43 కోట్లకు తగ్గింది.
అంటే మొత్తం మీద సుమారు 2.29 కోట్ల మంది ఓటర్లు తగ్గారు. ఇది సుమారు 13.2 శాతానికి సమానం. రాష్ర్టాలన్నింటిలోకెల్లా అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్ మొత్తం తగ్గుదలలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. రెండో దశలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రకియను చేపట్టిన ఉత్తర ప్రదేశ్లో ఈ ప్రక్రియకు ముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితాలో 12.56 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 13.40 కోట్లుగా నమోదైంది. నికర నష్టం సుమారు 2.04 కోట్లు లేదా 13.24 శాతంగా ఉంది. ఐదు రాష్ర్టాల్లో ఇదే అత్యధికం. ఈ ముసాయిదా నుంచి సుమారు 2.89 కోట్ల పేర్లను తొలగించగా వాటిలో సుమారు 0.84 కోట్లు(దాదాపు 29 శాతం) తిరిగి చేరాయి.
పంజాబ్లో 6.34% తగ్గుదల
మూడవ దశలో సర్ నిర్వహించిన పంజాబ్లో ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 2.15 కోట్ల నుంచి 1.94 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 2.01 కోట్లుగా నమోదైంది. ఉత్తరాఖండ్లో ఓటర్ల సంఖ్య 0.80 కోట్ల నుంచి 0.71 కోట్లకు తగ్గి, చివరకు 0.72 కోట్లుగా నమోదైంది. ఓటర్ల సంఖ్యలో సుమారు 0.08 కోట్ల మేర, అంటే 10.07 శాతం నికర తగ్గుదల కనిపించింది. మణిపూర్లో మూడవ దశలో సర్ నిర్వహించగా ఓటర్ల సంఖ్య 0.209 కోట్ల నుంచి 0.193 కోట్లకు పడిపోయి చివరకు 0.196 కోట్లతో ముగిసింది. నికరంగా 6.33 శాతం తగ్గారు. గోవాలో సుమారు 0.013 కోట్ల మేర లేదా 10.76 శాతం నికర నష్టం నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

