నిమ్స్‌లో ఏసీబీ దాడులు
నిమ్స్‌లో సోమవారం మరోసారి ఏసీబీ దాడులు నిర్వహించింది.
- రెండోసారి తనిఖీలు.. పలు రికార్డుల పరిశీలన
సిటీబ్యూరో: నిమ్స్‌లో సోమవారం మరోసారి ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇటీవల జరిపిన తనిఖీలలో సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, క్యాంటీన్, మ్యాన్‌పవర్ రిక్రూట్మెంట్ టెండర్లకు సంబంధించిన కీలక వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా జరిపిన తనిఖీల్లో మందుల కొనుగోలు, లోకల్ పర్చేసింగ్, ఎల్-1, ఎల్-2 మందుల తారుమారు, వైద్యపరికరాల కొనుగోళ్లు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత మరోసారి నిమ్స్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు అధికారులు, సిబ్బంది ఇళ్లలో తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో కొంతమంది అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, అక్రమాస్తుల కేసు ఎదుర్కొంటూ జైలులో ఉన్న నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.లక్ష్మీ భాస్కర్ వ్యవహారంతో దవాఖానలోని ఇతర అవినీతి, అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా సోమవారం మరోసారి ఏసీబీ అధికారులు నిమ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల వరుస ఝలక్‌లతో నిమ్స్‌లోని కొందరు అక్రమార్కులు ఉలిక్కిపడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీభాస్కర్ వాంగ్మూలం మేరకు ఏసీబీ అధికారులు వరుసగా నిమ్స్‌పై దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం మరోసారి రాత్రి వరకు తనిఖీలను కొనసాగించారు. దీంతో కొందరు అక్రమార్కులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఈ కేసు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందడమే కాకుండా కేసుల నుంచి తప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తొక్కరాని గడప తొక్కుతూ ఎలాగైనా ఏసీబీ గండం నుంచి గట్టెక్కించాలంటూ మరికొందరు బడాబాబులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

