జైళ్లలో ఖైదీల కోసం ‘ఉల్లాసం’
ఖైదీల మానసిక ఆరోగ్యం, వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడం కోసం ‘ఉల్లాసం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు తగ్గించడంతో పాటు, వారిలో మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
- వినోద, క్రీడా, సృజనాత్మకతను వెలికితీస్తాం
- ఆత్మహత్యల ఆలోచనలు తగ్గిస్తున్నాం: డీజీ సౌమ్యామిశ్రా
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఖైదీల మానసిక ఆరోగ్యం, వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడం కోసం ‘ఉల్లాసం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు తగ్గించడంతో పాటు, వారిలో మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. సోమవారం చంచల్గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఖైదీలను వినోద, క్రీడా, ఇతర సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతామని అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్కు చెందిన ట్రెస్టిల్ సూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారం అందిస్తుందని చెప్పారు. పురుష ఖైదీల కోసం వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, ఇతర బోర్డు గేమ్స్, వినోద కార్యక్రమాలు, మహిళా ఖైదీల కోసం పజిల్ గేమ్స్, మ్యూజికల్ చైర్స్, స్పూన్ రేస్, బెలూన్ గేమ్, రన్నింగ్ రేస్, బ్యాడ్మింటన్, చెస్, డాడ్జ్ బాల్, క్యారమ్స్ వంటి ఆటలతో పాటు ఇతర వినోద కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మొదట ఈ కార్యక్రమాన్ని చర్లపల్లిలో నిర్వహిస్తామని, అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లా జైళ్లలో ప్రారంభిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

