హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పులను సవరించుకునే వీలు కల్పిస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1నాటికి 18 ఏండ్లు పూర్తయ్యేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వచ్చే జనవరి 1న 18 ఏండ్లు నిండేవారి పేర్లను ఈసారి సవరణ జాబితాలో నమోదు చేయనున్నారు.