కరీంనగర్ : రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతిపట్ల సింగరేణి సిబ్బంది నివాళులర్పించారు.