Nalgonda | నల్లగొండ, అక్టోబర్ 16 : నల్లగొండ బత్తాయి మార్కెట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మేలు కోరి మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చారని సంతోషపడిన రైతులు.. అరగంట తర్వాత తెల్లబోయారు. ప్రారంభించిన అర గంటకే కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేయడంతో అందరూ కంగుతిన్నారు. అసలు సెంటరే లేని ప్రాంతంలో మినీ మాక్సీ వాహనంలో నాలుగైదు క్వింటాళ్ల పత్తి ని తెప్పించి కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్టు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి ఫొటోలకు ఫోజులు ఇచ్చి పత్తి రైతులను బురిడీ కొట్టించారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారులోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు మంత్రులు హాజరవుతున్నారని ఒకరోజు ముందే అధికారులు ఫ్లెక్సీలు, ప్రకటనలతో హోరెత్తించారు.
బుధవారం ధాన్యం కొనుగో లు కేంద్రంతోపాటు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇద్దరు మంత్రులు ప్రారంభించి వెళ్లారు. ఆ త ర్వాత కొద్దిసేపటికే కనగల్‌కు చెందిన రైతు తాను తీసుకొచ్చిన పత్తిని తిరిగి వాహనంలో వేసుకుని వెళ్లాడు. కేవలం పత్తి కొనుగోలు కేం ద్రం ప్రారంభం కోసమే తీసుకొచ్చాడని తెలిసి మిగతా రైతులు ముక్కున వేలేసుకున్నారు. న ల్లగొండ జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు టెండర్లు వేశాయి. వా టిని ఇప్పటి వరకు సీసీఐ ఇన్స్టలేషన్ చేయకుండా పెండింగ్‌లోనే ఉంచింది. వారి పని పూర్తయితే గానీ మార్కెటింగ్ యంత్రాంగం అ ప్రూవల్ ఇవ్వదు. కొనుగోలు కేంద్రాల ఎంపిక సీసీఐ వద్ద పెండింగ్‌లో ఉండగా.. మంత్రులు మాత్రం ఉత్తుత్తి కేంద్రం ప్రారంభించి పత్తి కొ నుగోలు చేస్తున్నట్టు హైడ్రామా చేయడం వి డ్డూరంగా ఉందని చర్చ సాగుతున్నది.