హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): అక్రెడిటేషన్ గుర్తింపు కలిగిన జర్నలిస్టులే తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ను ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులేని వారు తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ అతికిస్తే చట్టప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టంచేశారు.