 
                                                            హైదరాబాద్, అక్టోబర్30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు 5 కంపెనీలు పోటీపడగా, అందులో 4మాత్రమే సాంకేతిక అర్హత సాధించా యి. అందుకు సంబంధించి వివరాల ను ప్రభుత్వానికి పంపి అనుమతులు తీసుకున్న తరువాత ఆయా కంపెనీల నుంచి ప్రైస్‌బిడ్లను ఆహ్వానించేందుకు ఇరిగేషన్‌శాఖ కసరత్తు చేస్తున్నది.
ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజై న్లు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవో ఐ) నోటిఫికేషన్‌ను ఇరిగేషన్‌శాఖ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈవోఐ దాఖలు చేసిన ఏజెన్సీల ప్రతినిధులతో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు గురువారం భేటీ అయ్యారు. 5 ఏజెన్సీలు ఆసక్తి చూపగా, 4 ఏజెన్సీలకు మాత్రమే సాంకేతిక అర్హతలున్నట్టు గుర్తించారు. వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.
 
                            