హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు వంద శాతం ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 16,374 పోలీస్స్టేషన్లలో క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్)ను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నది. సీసీటీఎన్ఎస్తో అనుసంధానించిన అన్ని పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణలోని అన్ని పోలీస్స్టేషన్లను ఇప్పటికే సీసీటీఎన్ఎస్తో అనుసంధానించినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 40 శాతం పోలీస్స్టేషన్లలో ఇప్పటికే సైబర్ క్రైం అనాలసిస్కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఏడాది కాలంగా సైబర్ మోసాలకు వినియోగిస్తున్న 266 మొబైల్ యాప్లను గుర్తించి బ్లాక్ చేసినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.