బండ్లగూడ, ఏప్రిల్ 17: బెట్టింగ్‌కు బానిసై మరో విద్యార్థి బలైన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్‌కు చెందిన పెద్ద నరసింహులు కుమారుడు పవన్(24)తన స్నేహితులతో కలిసి అత్తాపూర్‌లో అద్దెకు ఉంటూ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు.
ఈక్రమంలో పవన్ ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిస అయ్యాడు. బెట్టింగ్ కోసం తన ఐఫోన్, బైక్‌ను సైతం అమ్మేశాడు. ఎలాంటి లాభాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై పవన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.