మహదేవపూర్, మే 29 : మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను బుధవారం భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పర్యవేక్షించారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో కుంగిన పియర్ ఖాళీ ప్రదేశాలతో గ్రౌటింగ్ చేసేందుకు ప్రారంభించిన బోర్ హోల్ పనులు, 20, 21వ గేట్ కట్టింగ్తోపాటు బరాజ్ దిగువన వరద ఉధృతి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇసుకలో కాపర్ షీట్ ఫైల్స్‌ను యంత్రాల సాయంతో అమర్చుతున్నారు. బరాజ్ ఎనిమిదో బ్లాక్ వరకు ప్రవాహం రాకుండా మట్టి కరకట్ట పనులు జరుగుతున్నాయి.