లింగల గణపురం : జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల గణపురం మండలం వడిచర్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) ఒకరు మృతి చెందారు. ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని విజయవాడకు చెందిన సయ్యపురాజు, రాంప్రసాద్, లవ కుమార్, శరత్ కుమార్ రామగుండంలో జరిగిన ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. వడిచెర్ల సమీపంలో జనగామ వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు.
ఈ క్రమంలో నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ డీసీఎంను గమనించకుండా ఎదురుగా వెళ్లి ఢీకొట్టాడు. ఈ సంఘటనలో కారులో ఉన్న విజయవాడ చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్ అలియాస్ బబ్లు(32) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా జనగామ హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలాన్ని జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.