Nagarkurnool | నాగర్కర్నూల్లో నెల రోజుల శిశువును కొరికిన ఎలుక.. చికిత్సకు సహకరించని చిన్నారి శరీరం
ఎలుక కొరకడంతో నెల రోజుల శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో చోటుచేసుకున్నది.
- నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘటన
Nagarkurnool | నాగర్కర్నూల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎలుక కొరకడంతో నెల రోజుల శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. పెద్దకార్పాములకు చెందిన శివతో నాగనూలుకు చెందిన లక్ష్మికి మూడేండ్ల కిందట వివాహం కాగా నెల కిందట బాబు జన్మించాడు.
లక్ష్మి నాగనూలులోని పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం ఉదయం ఇంట్లో శిశువు ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. గాయాన్ని గుర్తించిన లక్ష్మి వెంటనే నాగర్కర్నూల్ జిల్లా దవాఖానకు తీసుకెళ్లింది. గాయం తీవ్రంగా ఉండటం, శిశువు వయస్సు దృష్ట్యా వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని నిలోఫర్లో చేర్పించారు. అప్పటికే గాయం తీవ్రంగా ఉండటంతో శిశువు శరీరం చికిత్సకు సహకరించలేదు. చికిత్స నిర్వహిస్తుండగానే ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

