చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎల్లగిరి వద్ద ఆగిఉన్న డీసీఎంను బైకు ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బైక్పై అన్నదమ్ములతోపాటు సోదరి వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకున్నదని తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.