తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. దశరథ్ అనే వ్యక్తి బైక్‌పై మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్తున్నారు. అతని వెనకాలే ఓ టిప్పర్ వస్తున్నది. నర్సాపూర్ చౌరస్తా వద్ద టిప్పర్ ఎడమవైపు టర్న్ తీసుకుంటున్నది.
అయితే అదేసమయంలో స్ట్రెయిట్‌గా వెళ్తున్న బైక్‌ను గమనించకుండా టిప్పర్ డ్రైవర్ ఎడమవైపు మళ్లారు. దీంతో ద్విచక్ర వాహనంపైనుంచి లారీ వెళ్లిపోయింది. ఈ క్రమంలో బైక్ ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్పటికే గాయపడిన దశరథ్కు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి.. అతడిని దవాఖానకు తరలించారు. ఇదంతా సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలియనప్పటకీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ వీడియో
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఢీకొట్టి పైనుండి వెళ్లిన టిప్పర్
ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధం.. బైక్‌పై ఉన్న దశరథ్కు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/BmxkquuxpO
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024