వీణవంక, నవంబర్ 23: ‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 వాహనాల కాన్వాయ్.. రక్షణగా వంద మంది పోలీసులు.. ఇదంతా ఓ ముఖ్యమంత్రికో.. ఓ మంత్రికో.. లేక ఎమ్మెల్యేకో కాదు.. కేవలం అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పాల్గొన్న కార్యక్రమం కోసం మాత్రమే.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని 13 గ్రామాల్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్‌బాబు శనివారం 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయగా, దళితబంధు బాధితులు అడ్డుకుంటారేమోనన్న సమాచారంతో 80 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్‌తోపాటు 20 మంది స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రణవ్ వాహనానికి ముందు, వెనుక పోలీస్ వాహనాలతోపాటు సుమారు 25 వాహనాలు కాన్వాయ్‌గా వచ్చాయి. 26 మంది ఇండ్లకు వెళ్లి చెక్కులు అందిస్తుండగా బయట పోలీసులు పహారా కాశారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.