గురువారం 02 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 21:34:07

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు

నల్లగొండ: జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాను ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు దైద సైదులు, 16 మంది క్షతగాత్రులు త్రిపురారం మండలం కంపసాగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఎమ్మెల్యే భాస్కరరావు ఘటనా  స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  నిడమనూరు మండలం ఇబ్రహీంపట్నం లో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.


logo