హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం బేగంపేట కట్టమైసమ్మ ఆలయం వద్ద లారీ ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని మధుసూదన్గా గుర్తించారు. కాగా, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.