వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని సుదర్శన్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.