మంథని రూరల్:ఎదురుగా దూసుకొచ్చిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు-కారు రోడ్డు పక్కన బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ దుర్మరణం చెందగా.. బస్సు డ్రైవర్, బస్సులోని ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కండక్టర్‌తోపాటు 13 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. పరకాల డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ ఎర్రగండి గుట్ట వద్ద మంథని రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటన పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.