Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శాసన సభ నివాళులర్పించనుంది.
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించింది.
Tg Assembly