హైదరాబాద్ :పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్‌కు పలువురు విరాళాలు అందించారు.
హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మంగళవారం నిజామాబాద్ వెలమ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసారు. కాగా, నిజామాబాద్ వెలమ అసోసియేషన్‌కు ప్రేమ్ సాగర్ రావు రూ. కోటి, అమరవాది హరికృష్ణ రూ. 6 లక్షలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా విరాళాలు అందించిన వారిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ వెలమ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.