నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమించారు. దీంతో సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను దాదాపు 1.50 లక్షల మంది దర్శించుకొన్నారు.రెండు వేల మంది శివ దీక్షాపరులు మాల విరమించి, మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
రాజన్న ఆలయంలో 2,600 మంది కళాకారులు 13 గంటలపాటు నిరంతరా యంగా శివార్చన కార్యక్రమాన్ని నిర్వహించా రు. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 7.30 వరకు కొనసాగింది. వేములవాడ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పర్యాటక ఆధ్వర్యం లో హెలిక్యాప్టర్ సేవలను ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రారంభించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని క్షీరగిరి క్షేత్రంతోపాటు హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం, పర్వతాల శివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పూజచేశారు. కేసీఆర్ ప్రధాని కావాలని స్వామివారిని వేడుకున్నట్టు మంత్రి తెలిపారు. కురవి భద్రకాళీ సమేత వీరభద్రుడికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలోని సాంబమూర్తి, నందిమేడారంలోని అమరేశ్వరాలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు శారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 18 : శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై ప్రభలో భక్తులు వేలాది పాల్గొని తన్మయత్వం చెందారు.
మెదక్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతరను శనివారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు వస్తారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వనదుర్గా భవానీ మాతకు పట్టువస్ర్తాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా.. సీఎం కేసీఆర్ పాలనలో ఇంకా అగ్రభాగాన నిలిచేలా ఆ పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు. మంత్రి వెంట మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.
అలంపూర్, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఆలయాలను దర్శంచుకొన్నారు. పూజలు చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించినట్టు తెలిపారు. దేశ్‌కీ నేత కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని కవిత సూచించారు.