హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న అమరుల స్మృతి చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సందర్శించారు. ప్రారంభ కార్యక్రమ నిర్వహణ, భద్రత ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో పోలీస్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణ తదితర ఏర్పాట్లు సవ్యంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్లు విక్రమ్‌సింగ్‌మాన్, సుధీర్‌బాబును ఆదేశించారు. సృ్మతివనం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్నందున ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.