హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : త్వరలో మిమ్మల్ని కశ్మీర్‌కు ఆహ్వానిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌వేదికగా రిైప్లె ఇచ్చారు. కశ్మీర్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఒమర్ అబ్దుల్లాకు కేటీఆర్ ఎక్స్‌వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ఒమర్ అబ్దుల్లా కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో గెలిచింది తాము మాత్రమే కాదని, సమస్త కశ్మీర్ ప్రజలని, అనేక ఎదురుదెబ్బలు తిన్న కశ్మీరీల జీవితాలను బాగుచేసుకునే అవకాశం లభించిందన్నారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే మిమ్మల్ని ఇక్కడికి స్వాగతిస్తానని ఒమర్ రీట్వీట్ చేశారు.