హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులను తీసుకెళ్లేందుకు ఒలెక్ట్రా ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్.. ఈబస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్లో తయారు చేస్తున్నది. గురువారం దేవస్థానముల రవాణా విభాగం జీఎం పీవీ శేషారెడ్డి తొలి బస్సును పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి ఉచితంగా అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాలలో స్వామివారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నట్టు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్ తెలిపారు.