ములుగురూరల్, అక్టోబర్ 13: విషజ్వరంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికాంబ (70) మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానలో చూపించగా తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఎంజీఎం దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
మాచారెడ్డి, అక్టోబర్ 13 : పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్తు తీగ తగలి ఓ బాలుడు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది. ఎస్సై అనిల్ తెలిపిన ప్రకారం.. బండరామేశ్వర్పల్లికి చెందిన సినిగిరి రాజేశ్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పొలంలో కోతులకు కాపలా కోసం వెళ్లాడు. కోతులు రావడంతో వాటిని కర్రతో తరుముతుండగా పంట పొలంలో ఉన్న విద్యుత్తు తీగ తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్సై తెలిపారు.