హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ కోరారు. గురువారం ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆయన సీఎస్ సంజయ్ జాజుకు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ స్కూళ్లల్లో సమస్యలు పరిషరించి, విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయకుంటే ఉద్యమం తప్పదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ హెచ్చరించారు. గురువారం హైదారాబాద్లోని మగ్ధూంభవన్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్య కాషాయీకరణ కోసం కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.