Liquor Price | చంద్రబాబు బాటలో రేవంత్ సర్కార్.. తెలంగాణ మద్యం విక్రయాల్లో కొత్త ప్లాన్!
liquor price | రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఆంధ్రాలో చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం సీసాలను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
Liquor Price | హైదరాబాద్ జూలై 16(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. మ ద్యాన్ని సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సీసాల సైజు ను సవరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఆంధ్రాలో చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం సీసాలను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ధరల నిర్ణయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ కానున్నది. ఇప్పటికే కంపెనీలతో 11 సార్లు సమావేశమైన ఈ కమిటీ ధరల పెంపుపై తుది నిర్ణయాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఇదే సమయంలో రాష్ట్ర మద్యం మార్కెట్లో 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో కొత్త మద్యం బా టిళ్లు ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పరిమాణాల్లో మద్యం సీసాలను ఉ త్పత్తి చేయగలం అని ఇప్పటికే కొన్ని మద్యం కంపెనీలు టీజీబీసీఎల్‌కు తెలియజేసినట్టు సమాచారం.
ఫుల్ బాటిల్ మీద రూ 100కు పైగా ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు సార్లు మద్యం ధరలు పెంచింది. గత ఏడాది ఫిబ్రవరిలో బీరు ధరలు 15 శాతం పెంచింది. రూ.210 ఉన్న బీరు ధరను రూ.30 నుంచి రూ.50 వరకు పెంచింది. అదే ఏడాది మేలో లిక్కర్ ధరలు పెంచింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు పెంచింది. తాజాగా మరోసారి ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ అన్ని తరహా బ్రాండ్లపై ధరల పెంపు ఉండే అవకాశం ఉంది.
ప్రీమియం బ్రాండ్ల ఫుల్‌బాటిల్‌పై రూ.100 వరకు, హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120, సాధారణ వినియోగదారులు ఎకువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్ మీద రూ.90 వరకు పెంపు ఉండవచ్చని సమాచారం. ధరల సవరణతోపాటు మద్యం బాటిళ్ల పరిమాణాల్లో మార్పులు చేయాలని తయారీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. కొత్త సీసాల ద్వారా నెలకు కనీసం 2 లక్షల కేసుల మద్యం అదనంగా విక్రయించవచ్చని టీజీబీసీఎల్ అంచనా వేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

