హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యవసాయశాఖకు మరో గుర్తింపు లభించింది. రాజేంద్రనగర్లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు(ఎఫ్సీవో)ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్(ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది.
దీంతో ఈ ప్రయోగశాల అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నదని అధికారికంగా ధృవీకరించారు.