Home
Telangana
A Shocking Incident Took Place At The Mother And Child Health Centre In Ramavaram The Headquarters Of Bhadradri
నిల్చున్న చోటే గర్భిణి ప్రసవం.. రామవరం ఎంసీహెచ్‌లో ఘటన
భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో దారుణం జరిగింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన పద్దం భవాని తొలిప్రసవం కోసం బుధవారం ఉదయం 10 గంటలకు రామవరం ఎంసీహెచ్‌కు వచ్చింది.
- బీఆర్ఎస్ నేతల పరామర్శ
రుద్రంపూర్, జూలై 16: భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో దారుణం జరిగింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన పద్దం భవాని తొలిప్రసవం కోసం బుధవారం ఉదయం 10 గంటలకు రామవరం ఎంసీహెచ్‌కు వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బెడ్ కేటాయించారు. సాధారణ కాన్పు అయ్యేందుకు ఇంజెక్షన్ ఇచ్చారు.
ఆమె కాలకృత్యాలు వస్తున్నట్టు అనిపించి వెళ్తున్న సమయంలో ఒకసారిగా శిశువు బయటికి వచ్చి కిందపడిపోయింది. నవజాత శిశువుకు స్వల్పగాయాలు కావడంతో అక్కడ ఉన్న గర్భిణులు ఆందోళనకు గురయ్యారు. శిశువు 2.90 కేజీల బరువుతో ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్ఎంవో సాగరిక తెలిపారు. భవానికి సాధారణ ప్రసవం అయ్యేలా చూశామని చెప్పారు. భవానిని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు గురువారం పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

