ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలి: ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి
- ఎవుసానికి ప్రాధాన్యం తగ్గిస్తున్న కేంద్రం
- రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి కేంద్రం రోజురోజుకు ప్రాధాన్యం తగ్గిస్తున్నదని రాజ్యసభసభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. పొరుగుదేశాల కన్నా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందుకు బడ్జెట్లో కేటాయించిన నిధులే సాక్షమని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేయాలని కేంద్రం చెప్తున్నదని, ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగుకోసం రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును పెంచాలని కేంద్రం మాటవరుసకు అంటే సరిపోదని, అందుకు తగిన కార్యాచరణ ఉండాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

