మక్తల్, మార్చి 27 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భా గంగా భూసేకరణ చేస్తున్న అధికారులకు చుక్కెదురైంది. భూములు కోల్పోతున్న వారికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు వెళ్లగా రైతులు తిరస్కరించారు. నారాయణపేట జి ల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో కొడంగల్ లిఫ్ట్ ప్రధాన పంప్‌హౌస్ నిర్మాణానికి 49 మంది రైతులు భూమిని కోల్పోతున్నారు. 64 ఎకరాలకు సంబంధించి ఏ రైతు ఎంత భూమిని కోల్పోతున్నాడని నోటీసులు సిద్ధం చేసి వాటిని సంబంధీకులకు ఇవ్వడానికి మక్తల్ ఆర్ఐలు రాములు, భూపాల్‌రెడ్డి వెళ్ల గా కాట్రేవుపల్లి రైతులు తిరస్కరించారు. ఎర్నగానిపల్లికి చెందిన ఒకరిద్దరు మాత్రం ఏమిటో తెలియకుండానే తీసుకున్నారు. అందరూ ముందుకు రాకపోవడంతో చేసేది లేక అధికారులు కాట్రేవుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు ఉన్న నోటీసును అతికించి వెనుతిరిగా రు. కొడంగల్ లిఫ్ట్‌లో భూములు కోల్పేయే కా ట్రేవుపల్లి రైతుల సంతకాలు సేకరించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని వారం క్రితం మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. పరిహారం విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.