హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆస్తిపన్ను ఆదాయం వెయ్యి కోట్లు దాటింది. శనివారం వరకు రూ.1,010 కోట్ల ఆస్తిపన్ను వసూలైనట్టు పురపాలకశాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థలు అన్ని కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్నుల వసూళ్లలో రూ.వెయ్యి కోట్ల మైలురాయిని అధిగమించినట్టు అధికారులు తెలిపారు. 2023-24లో రూ.922 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 31) ముగియడానికి రెండురోజులే గడువు ఉండటంతో ప్రజలు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. పాత బకాయిల అపరాధ రుసుంపై వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (వోటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోనే ఆస్తిపన్ను బకాయిలు రూ.7వేల కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం.