హైదరాబాద్: తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు సదర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది వాటిని రాత్రికిరాత్రే తొలగించి వాటిని లారీల్లో తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
తెలంగాణ భవన్ లోపల, బయట ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ విధానాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీశ్ రావుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీలను తొలగించి సైకో రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందాలనుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారి బర్త్ డే సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించిన రేవంత్ సర్కార్
రేవంత్ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను… pic.twitter.com/paCaHsjpF2
— BRS Party (@BRSparty) June 3, 2025