మాగనూరు, నవంబర్ 28 : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని 25 పాఠశాలల్లో 3,187 మంది విద్యార్థులు చ దువుతున్నారు. అందరికీ ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా కేవలం 40 శాతం మందికే పంపిణీ చేశారు.
కొన్ని దుస్తులను మహిళా సమాఖ్య గదుల్లో వృథాగా పారవేశారు. గురువారం డీపీఎం మాసన్న మాగనూరు మహిళా సమాఖ్యను తనిఖీ చేయగా ఓ గదిలో వెయ్యికిపైగా ఏకరూప దుస్తులు వృథాగా పడి ఉండడంపై ఏపీఎంతోపాటు సిబ్బందిపై మండిపడ్డారు.