హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 7 వేల స్టాఫ్‌నర్స్ పోస్టల భర్తీకి శుక్రవారం ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. బండ్లగూడ జాగీర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో శుక్రవారం నుంచి అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంత మంది అభ్యర్థులు కోఠిలోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టారు. మెరిట్ లిస్ట్ తప్పుల తడకగా ఉన్నదంటూ మండిపడ్డారు. తమకంటే తకువ మారులు వచ్చిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయని తమ నంబర్లు లేవని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏండ్లుగా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నా వెయిటేజీకి సంబంధించిన మారులు కలపలేదని మరికొందరు ఆరోపించారు. కొత్తగా జత చేసిన 1800 పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ 6వ జోన్‌కు చెందిన కొందరు అభ్యర్థులు వాపోయారు. కేవలం 11 పోస్టులు మాత్రమే కలిపారంటూ మండిపడ్డారు. దీంతో మిగతా జోన్లలో తక్కువ మార్కులు వచ్చినవారికి కూడా పోస్టింగ్ వచ్చిందని, తమకు ఎక్కువ మార్కులున్నా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన బోర్డు అధికారులు.. అభ్యర్థుల అందరి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తేలితే.. తిరిగి మెరిట్ లిస్ట్‌లో పెట్టి, వెరిఫికేషన్ నిర్వహిస్తామన్నారు.
స్టాఫ్ నర్స్ పోస్టుల ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ జోనల్ క్యాడర్ పోస్టులు. కాబ్టటి మెరిట్ జాబితాలో జోన్ల వారీగా ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఏయే జోన్లో కటాఫ్ ఎంత ఉన్నదో, ఎంత మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచామో స్పష్టంగా వివరించాలి. కానీ, కనీసం జోన్ల వారీగా మెరిట్ లిస్టులు కూడా ఇవ్వలేదు. జోన్ల వారీగా కటాఫ్ ప్రకటించలేదు. ఫలితంగా చాలామంది తమకంటే తకువ మారులు వచ్చిన వారి హాల్ టికెట్ నంబర్లు మెరిట్ లిస్టులో కనిపించడం చూసి కంగుతిన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేపట్టారు. జోన్ల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కటాఫ్ వివరాలను ప్రకటించాలని డిమాండ్
చేస్తున్నారు.