హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో ఆన్డ్యూటీలను అధికారులు రద్దుచేశారు. 18మంది జూనియర్ లెక్చరర్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్ ఓడీని రద్దుచేసి వారి సొంత స్థానాలకు పంపించారు. వీరంతా తమ పాత స్థానాల్లో రిపోర్ట్చేయాలని ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణఆదిత్య ఆదేశించారు.