హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఆటవీశాఖలో ఉద్యోగులుగా నియామకమైన ఐఎఫ్ఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలువగా, ఆయన వారిని అభినందించారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
తెలుగు నేర్చుకోవడం ద్వారా ప్రజలతో మరిం త సన్నిహిత్యం ఏర్పడడంతోపాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయని పేరొన్నారు. దేశం 2047 ‘రైజింగ్ ఇండియా’ లక్ష్యంతో ముందుకు సాగుతున్నందున ఆ విజన్‌కు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. 2027లో గోదావరి పుషరాలు జరుగనున్న సందర్భంగా బాస ర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఏకో కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
హైదరాబాద్, జనవరి 8 (నమ స్తేతెలంగాణ): ఉపాధిహామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర దాగి ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అదానీ, అంబానీలకు పేదలను కూలీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీలో వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించామని తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు, సీనియర్ నాయకులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని పాత పద్ధతిలో పునరుద్ధరించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి 9వరకు ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.