హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అధికారులు 8,946 కిలోల నారోటిక్స్ డ్రగ్స్ సహా సైకోట్రోపిక్ పదార్థాలను దుండిగల్ ప్రాంతంలో ధ్వంసం చేశారు.
నాశనమైన వాటిలో 2655 కిలోల గంజాయి, 11 కిలోల హెరాయిన్, 409 కిలోల అల్ఫాజోలం, 143 కిలోల ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్, 75 కిలోల కెటామైన్ వంటి మత్తు పదార్థాలు, రసాయనాలు ఉన్నాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు తెలిపారు.