రాజన్న సిరిసిల్ల, జూలై 21( నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టి తెలంగాణను ఎండబెడుతున్న రేవంత్ సర్కార్.. సేద్యానికి నీళ్లు ఇవ్వలేమని చావు కబురు చల్లగా చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు (శ్రీరాజరాజేశ్వర), ఎగు వ మానేరు, మల్కపేట, అనంతగిరి అన్నపూర్ణ జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నదని, పంటలకు నీరు ఇచ్చే అవకాశం లేదని కరీంనగర్లోని చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్ట్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద సాగు చేసే ఆయకట్టు రైతులు గమనించాలని సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితు లు ఏర్పడి సీజన్ మొదలై రెండు నెల లు కావస్తున్నా ఒక్క గట్టి వానపడలేదు. ప్రాణహిత నదీజలాలు వృథా గా పోతున్నా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మేడిగడ్డతో సంబంధం లేకుం డా కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే అవకాశమున్నా, కేవలం గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న కారణంతో రాజకీయ కక్షతో ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.