ఆసిఫాబాద్ టౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ( Indiramma Houses) చేపడుతున్న భూమి పూజకు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (MLA Kova Laxmi) శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎలాంటి రాజాకీయ హోదా లేని వారితో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రిసైడింగ్ ఇప్పిస్తూ స్థానిక ఎమ్మెల్యే ను అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెబ్బెన ఎంపీడీవో , తీర్యాని హౌసింగ్ ఏఈలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేసి హార్డ్ కాపీ తనకు ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు.