ఖైరతాబాద్, అక్టోబర్ 6: గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా)ను జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసి పేద విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మాజీ మంత్రులు కోరారు. రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి సాయన్నగౌడ్, జీవీ శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్గౌడ్తోపాటు ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బూర నర్సయ్యగౌడ్, విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మాజీ ఎమ్మెల్సీలు రాజలింగంగౌడ్, గంగాధర్‌గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కే సత్యనారాయణగౌడ్, కూన శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.